Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sabarimala: శబరిమలలో భారీ వర్షాలు.. భక్తులు రావొద్దు.. నాలుగు రోజులు ఆగండి.. (video)

Advertiesment
Sabarimala

సెల్వి

, శనివారం, 14 డిశెంబరు 2024 (12:52 IST)
Sabarimala
Sabarimala: కేరళలో శబరిమల కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణతో నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యనూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో 22 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
 
అయితే కేరళలోని శబరిమలలో తుఫాన్ కారణంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని, మాల ధరించిన భక్తులు ఇప్పుడు శబరిమలకు రావద్దని సూచనలు చేశాడు ఓ భక్తుడు. ఈ వర్షం ఇంకో మూడు నుంచి నాలుగు రోజులు ఉండే అవకాశం ఉందని, భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని వీడియో సందేశంలో కోరాడు.
 
తుఫాన్ కారణంగా కొండ చరియల్లో చెట్లు విరిగి పడుతున్నాయని, కొండపై పూర్తిగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇలాంటి సమయంలో శబరిమలకు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ భక్తుడు పేర్కొన్నాడు. మాల ధరించిన భక్తులు కొంత సమయం ఆగి తుఫాన్ తగ్గాక ప్రయాణాన్ని మొదలు పెట్టాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇకపోతే.. మండలం- మకరవిలక్కు సీజన్ ముగియడానికి చివరి 10 రోజుల్లోగా అయ్యప్ప రూపంలోని బంగారు లాకెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టామని ట్రస్ట్ తెలిపింది. 1980లో తొలిసారిగా అయ్యప్ప స్వామి బంగారు లాకెట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు అధికారులు. 2011- 2012 సీజన్ వరకూ అమ్మకాలు కొనసాగాయి. అప్పట్లో ఆగిపోయిన ఈ లాకెట్ల విక్రయాన్ని మళ్లీ మొదలెట్టనుంది అయ్యప్ప ఆలయ ట్రస్ట్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Beautiful wives available: ఈ దేశంలో అందమైన భార్యలు అద్దెకు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా?