Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

Sabarimala

ఠాగూర్

, సోమవారం, 25 నవంబరు 2024 (10:44 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలై భక్తులతో నిండిపోయింది. ఫలితంగా ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత యేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకుంటున్నారు.
 
ఈ నెల 16వ తేదీన ఆలయం తెరుచుకోగా, ఈ తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం (ట్రావెన్ కోర్ దేవస్వాం బోర్డు) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. గత యేడాది ఇదే వ్యవధిలో కేవలం 3,03,501 మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలిపారు. పోలీసుల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారని చెప్పారు.
 
గత యేడాది రూ.13.33 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటివరకు రూ.41.64 కోట్లు విరాళాల వచ్చాయని తెలిపారు. వండి పెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్‌లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పంబాలోని మనప్పరం ఆన్‌లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఇక పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. నదిని కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్