Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

Advertiesment
nara lokesh

సెల్వి

, బుధవారం, 20 నవంబరు 2024 (20:16 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రజలను ఆదుకునేందుకు ముందుంటున్నారు. కేరళలో తెలుగు అయ్యప్ప భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి సాయం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
 
ఈ మేరకు నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుల బృందం కేరళలో ఇబ్బందులు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారికి మంత్రి నారా లోకేష్ త్వరగా సహాయం అందించారు. 
 
వివరాల్లోకి వెళితే శబరిమల యాత్రలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. తప్పు చేయనప్పటికీ వారిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. 
 
అధికారుల నుండి సరైన సహకారం లేకుండా తమను నిర్బంధించారని పేర్కొంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియో చూసిన వెంటనే, కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించిన నారా లోకేష్  ఎక్స్ ద్వారా భక్తులకు భరోసా ఇచ్చారు. వీడియో చూసిన వెంటనే, నారా లోకేష్ ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. "గమనించాను. మేము కేరళ ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం వీలైనంత త్వరగా మా ప్రజలను ఇంటికి తీసుకువస్తాము." అన్నారు. 
 
ఇకపోతే.. కేరళ అధికారులతో చర్చించిన తరువాత, లోకేశ్ విజయవంతంగా నిర్బంధించబడిన అయ్యప్ప భక్తులను విడుదల చేయడం ద్వారా వారిని మరింత అడ్డంకులు లేకుండా శబరిమలకు తీర్థయాత్ర కొనసాగించడానికి వీలు కల్పించారు. వారిని విడిపించే ముందు పోలీసు అధికారులు వారికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
 
నారా లోకేష్ సత్వర చర్యకు కృతజ్ఞతలు తెలిపిన భక్తులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నెల్లూరు ఎమ్మెల్యే థామస్, తిరుపతి పార్లమెంటరీ కన్వీనర్ భీమినేని చిట్టి నాయుడు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?