Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

Advertiesment
ambualane and car

ఠాగూర్

, ఆదివారం, 17 నవంబరు 2024 (22:54 IST)
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వని కారు యజమానికి ట్రాఫిక్ పోలీసులు తగినశాస్తి చేశారు. ఏకంగా రూ.2.5 లక్షల అపరాధం విధించడమే కాకుండా, కారు యజమాని డ్రైవింగ్ లైసెన్స్‌ను సైతం రద్దు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత కీలకమైనది... అంబులెన్స్. అందుకే ఎంతటి ట్రాఫిక్ ఉన్నప్పటికీ అంబులెన్స్ వస్తే దారిస్తారు. అంబులెన్స్‌కు సిగ్నళ్ల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. బెంగళూరు వంటి నగరాల్లో అంబులెన్స్‌కు దారిచ్చేందుకు వాహనదారుల సిగ్నల్ జంప్ చేసినా జరిమానా ఉండదు. మరి, అంబులెన్స్‌కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది, కేరళలో ఓ ప్రబుద్ధుడు అంబులెన్స్‌కు దారివ్వకుండా ఇబ్బందిపెట్టాడు. అతడికి అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. 
 
కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్‌కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్‌కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదేపనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోలేదు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్‌లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ప్రతి ఒక్కరూ ఆ కారు యజమానిని తెగ తిట్టారు.
 
ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఆ కారు ఎవరిదో గుర్తించి, నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. అంబులెన్స్‌కు ఎందుకు దారి ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే ఆ కారు యజమాని చెప్పిన సమాధానాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండడంతో, పోలీసులు మండిపడ్డారు. ఆ కారు యజమానికి రూ.2.5 లక్షల ఫైన్ వేయడంతోపాటు అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ చర్య తీసుకున్న పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ