Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్‌యూవీ బానెట్‌పై ట్రాఫిక్ పోలీస్.. పట్టించుకోని డ్రైవర్.. 100 మీటర్లు..? (video)

Advertiesment
Traffic Police

సెల్వి

, శనివారం, 26 అక్టోబరు 2024 (10:53 IST)
Traffic Police
కర్ణాటక, శివమొగ్గలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీ ప్రమాదకరంగా మారింది. ఒక ట్రాఫిక్ పోలీసు తనిఖీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఎస్‌యూవీ డ్రైవర్ బానెట్‌పై 100 మీటర్లకు పైగా పోలీసుతో పాటు కారును నడిపాడు. 
 
బీహెచ్ రోడ్‌లోని సహ్యాద్రి కళాశాల సమీపంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ అధికారులు భద్రావతి నుండి వచ్చిన ఎస్‌యూవీని ఆపి పార్క్ చేయమని సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్‌యూవీ కారు ఆగిపోయింది. కానీ డ్రైవర్ తనిఖీ కోసం కారును పార్క్ చేయడానికి నిరాకరించాడు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ట్రాఫిక్ పోలీసు ఎస్‌యూవీని రోడ్డు పక్కన పార్క్ చేయమని డ్రైవర్‌ను ఆదేశించినట్లు చూపిస్తుంది. అయితే ఆ కారు డ్రైవర్ మాత్రం ట్రాఫిక్ పోలీసు బానెట్‌పై వున్నది కూడా పట్టించుకోకుండా వంద మీటర్ల పాటు కారును నడుపుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇలా అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని భద్రావతిలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మిథున్ జగదలేగా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ వెల్ల‌డించారు. అదృష్టవశాత్తూ, ట్రాఫిక్ అధికారి తీవ్రగాయాలు లేకుండా బయటపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో భారీ మహాత్మా గాంధీజీ విగ్రహం: సీఎం రేవంత్ రెడ్డి