తను మాట్లాడిన మాటలతో ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో తెలుసుకున్నాను, అందుకే పేరుపేరునా ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నానంటూ శ్రీరెడ్డి బహిరంగ లేఖ రాసింది. ఆమె తన లేఖలో... ''లోకేష్ అన్నా.. నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి. కానేకాదు. ఈ వారం రోజులు నిద్రాహారాలు మాని కామెంట్స్ చదివి, ఎంతో మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి.
భవిష్యత్తులో వైసిపి తిరిగి అధికారంలోకి వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఫిల్తి లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చెసి చెబుతున్నా. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది ఎంత బాధ వుంటుందో అని.
ఇప్పటికి నేను, నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావలసిన ముగ్గురు పిల్లలు వున్నారు. నన్ను కొడితే ఒక నెల లేదా 3 నెలలు గాయాలు కావచ్చు. కానీ నావల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే వుంటుంది. ప్లీజ్ అన్నా సేవ్ మై ఫ్యామిలీ." అంటూ పేర్కొంది.