Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరిసే మెరిసే` ను అభినందించిన‌న.వినాయ‌క్‌

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (15:48 IST)
Vinaya-merise team
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ అభినందించారు.
 
వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ ``డైరెక్ట‌ర్ ప‌వ‌న్ రాజ‌మండ్రి కుర్రాడు. మా నాన్న‌గారి స్నేహితుడు సుబ్బ‌రాజుగారి అబ్బాయి అయిన ప‌వ‌న్ `మెరిసే మెరిసే` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌టం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ప‌వ‌న్‌కు చాలా మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే హుషారు చిత్రంలో న‌టించిన దినేశ్ హీరోగా న‌టించాడు. ఈ సినిమాకు ప‌నిచేసిన యూనిట్‌లో చాలా మంది రీసెంట్ సినిమాల్లో ప‌నిచేసిన‌వారే. ఓ మంచి టీమ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం డెఫ‌నెట్‌గా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను..ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ కె మాట్లాడుతూ, యుక్త‌వ‌య‌సులోని అమ్మాయి, అబ్బాయిల మ‌న‌సులు సునిశితంగా ఉంటాయి. అలాంటివారు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నారు..ఎలా స‌క్సెస్ అయ్యార‌నే క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది. క‌చ్చితంగా అందిర‌కీ ఈ సినిమా న‌చ్చుతుంది. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం అన్నారు. 
 
హీరో దినేశ్ తేజ్ మాట్లాడుతూ ``కోవిడ్ స‌మ‌యంలో చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసి సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇండ‌స్ట్రీ నుంచి చ‌క్క‌టి మ‌ద్ద‌తు ల‌భించింది. వినాయ‌క్ వంటి పెద్ద డైరెక్ట‌ర్ మా యూనిట్‌ను అభినందించ‌డ‌మే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. మెరిసే మెరిసేస చ‌క్క‌టి మూవీ. ప్లెజంట్ గా ఉంటుంది. థియేటర్ లలో చూసి ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments