వివిధ భాష‌ల‌కు చెందిన ఆరుగురు మ‌గ‌వారు ఆరుగురు ఆడ‌వారితో నాని `మీట్ క్యూట్‌` చిత్రం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (15:40 IST)
meet cuite
వాల్ పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి నాని స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ప్ర‌శాంతి తిపిర్‌నేని నిర్మాత‌గా వైవిధ్య‌మైన సినిమాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఆ, హిట్` వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు రూపొందించి ఆడియెన్స్‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అదే త‌ర‌హాలో డిఫ‌రెంట్ కంటెంట్‌తో `మీట్ క్యూట్‌` అనే అంథాల‌జీని రూపొందిస్తోంది వాల్ పోస్ట‌ర్ సినిమా. `ఆ` సినిమాతో ప్ర‌శాంత్ వ‌ర్మ‌, `హిట్` చిత్రంతో శైలేష్ కొల‌ను వంటి టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన ఈ బ్యాన‌ర్ ఇప్పుడు `మీట్ క్యూట్‌` ద్వారా దీప్తి గంటాను ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తున్నారు.
 
అంద‌రిలో ఆస‌క్తిని క్రియేట్ చేస్తూ `మీట్ క్యూట్‌` ప్రాజెక్ట్‌ను జూన్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఐదు క‌థల సంక‌ల‌నంగా రూపొందుతోన్న ఈ అంథాల‌జీని సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ అంథాల‌జీలో రోహిణి, ఆదాశ‌ర్మ‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, ఆకాంక్ష సింగ్‌, రుహానీ శ‌ర్మ‌, సునైన‌, సంచితా పూనాంచ, అశ్విన్‌కుమార్, శివ కందుకూరి దీక్షిత్ శెట్టి, గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, రాజా ఇలా ఇందులో వేర్వేరు భాష‌ల‌కు చెందిన‌ ఆరుగురు మేల్ లీడ్స్‌, ఆరుగురు ఫిమేల్స్‌ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
వ‌సంత్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గానిన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌, గ్యారీ బి.హెచ్ ఎడిట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments