Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా అనేది ప్రతి ఒక్కరి కల- రాజమౌళి

Webdunia
శనివారం, 7 మే 2022 (18:16 IST)
Rajamouli, Gaurish Yeleti, Roshini, Prachi Thakkar, and ohters
ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‪ను శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‪లో జరిగిన కార్యక్రమంలో.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. 
 
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఓ కల మూవీ ఫస్ట్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. సినిమా అనేది ప్రతి ఒక్కరి కల. ఈ చిత్రంతో మీరంతా ఆ కలను నెరవేర్చుకున్నారు. ఇంకా ఎందరో ఈ కలతో బతుకుతున్నారు. గట్టిగా కృషితే చేస్తే అలాంటి వారందరి కల నెరవేరుతుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ‘హిట్’ సినిమా దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపుని తీసుకువచ్చిన మన దర్శకధీరుడు రాజమౌళిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదలవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆశీస్సులు మాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఆయనెప్పుడు ఇలా డైరెక్టర్స్‪కి స్పూర్తిగానే నిలుస్తుండాలని కోరుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. వారిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‪తో.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‪టైనర్‪గా ఉండబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పగలను..’’ అని తెలిపారు.
 
గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, రవితేజ(కమెడియన్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
సంగీతం: నీలేష్ మందలపు
ఎడిటర్: సత్య గిడుటూరి
ఆర్ట్: ప్రేమ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ మోతూరు
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి
దర్శకత్వం: దీపక్ కొలిపాక 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments