Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ‌విష్ణు కు బ్రైట్ ఫ్యూచ‌ర్ వుంది - రాజ‌మౌళి

Srivishnu, Rajamouli, Katherine Theresa, Sai Korrapati, Chaitanya Danthuluri
, బుధవారం, 4 మే 2022 (16:28 IST)
Srivishnu, Rajamouli, Katherine Theresa, Sai Korrapati, Chaitanya Danthuluri
శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే 6న  సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌ లోని జె.ఆర్‌సి. క‌న్‌వెన్‌ష‌న్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథులుగా ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, శేఖ‌ర్ క‌మ్ముల హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిగ్ టికెట్‌ ను వారిరువురూ ఆవిష్క‌రించారు.
 
అనంత‌రం రాజ‌మౌళి మాట్లాడుతూ, చైత‌న్య బాణం సినిమా చూసిన‌ప్పుడు మొద‌ట ఎవ‌రైనా చిన్న సినిమాగా తీస్తారు. త‌ను మాత్రం పెద్ద సినిమా తీశాన‌నే యాటిట్యూడ్ క‌నిపించేలా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే చేశాడు. ప్ర‌తి మూమెంట్‌లోనూ త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే స‌స్పెన్స్ క్రియేట్ చేశాడు. స‌స్పెన్స్ రివీల్ చేస్తున్న‌ప్పుడు హైగా వుండేలా చూసుకున్నాడు. శ్రీ‌విష్ణు ప‌క్కింటి కుర్రాడిలా వుంటాడు. చేప నీటిలోకి ఈజీగా వెళ్ళిన‌ట్లు త‌ను కూడా మాస్ పాత్ర‌లోకి షిప్ట్ అయిపోతాడు. సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు ఎలా వుంటాడో చివ‌రిలోనూ అలానే వుంటాడు. తెలుగులో త‌న‌కంటూ ఒక జోన‌ర్‌ ను క్రియేట్ చేసుకున్నాడు. మంచి క‌థ‌ను ఎంపిక చేసుకున్నాడు. ఫ్యూచ‌ర్ బ్రైట్‌గా క‌నిపిస్తున్న హీరోల్లో ఒక‌డు. క్యాథ‌రిన్‌ కు మంచి పాత్ర రాశారు. ఇద్ద‌రి జంట బాగుంది. ల‌వ్ స్టోరీ కాకుండా ఇన్‌వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా స్ట్రాంగ్ పాత్రలో ఆమెను చూపారు. సాయికొర్ర‌పాటిగారు మొద‌టి నుంచి సినిమాపై పూర్తి న‌మ్మ‌కంగా వున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌., కెజి.ఎప్‌.2 రిలీజ్‌ కు ముందు ఈ సినిమా గురించే టాపిక్ వ‌చ్చేది. భ‌ళా తందనాన బాగుంద‌ని చెప్పేవారు. ఆయ‌న చేసిన 7,8 సినిమాల్లో మంచి కాన్‌ఫిడెన్స్ క‌నిపించింది. అందుకే ఓటీటీలో మంచి ఆఫ‌ర్ వున్నా థియేట‌ర్‌ లోనే విడుద‌ల చేస్తున్నారు. సాయిగారు ఏ సినిమా అయినా టెక్నిక‌ల్‌ గా బాగుండాల‌ని కోరుకుంటారు. సౌండ్ డిజైన్ బాగుంది. భ‌ళా తంద‌నాన బిగ్ హిట్ అవుతుంది. మే 6న థియేట‌ర్‌లో చూడండి అని అన్నారు.
 
 శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ,  చైత‌న్య తీసిన `బాణం` నాకు ఇష్ట‌మైన సినిమా. స్క్రిప్ట్‌ కూ, కంటెంట్‌ కు విలువ ఇచ్చేవాడు. ముందుముందు మ‌రిన్ని సినిమాలు ఆయ‌న్నుంచి రావాలి. ట్రైల‌ర్ చాలా బాగుంది. శ్రీ విష్ణు `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌` సినిమాలో చిన్న పాత్ర చేశాడు. డెడికేష‌న్ వుంది. అందుకే చాలా ప్ర‌శ్న‌లు వేసేవాడు. పాత్ర‌కు ప్రిపేర్ అయ్యేవాడు. మ‌ణిశ‌ర్మ సంగీతం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. సాయిగారు డిస్ట్రిబ్యూట‌ర్‌ గా తెలుసు. మంచి రిలేష‌న్ వుంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
 
 క్యాథ‌రిన్ మాట్లాడుతూ, ఇందులో శ‌శిరేఖ పాత్ర పోషించాను. శ్రీ‌కాంత్ విస్సా బాగా రాశాడు. చైత‌న్య అద్భుతంగా వెండితెర‌పై చూపారు. నా కెరీర్‌ లో చెప్పుకోద‌గిన పాత్ర అవుతుంది. శ్రీ‌విష్ణు సెటిల్డ్ గా పాత్ర‌లు చేస్తున్నారు. త‌ను సినిమా అయ్యేంత‌వ‌ర‌కూ పెద్ద‌గా మాట్లాడేవాడు కాదు. మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ వుంది. మ‌ణిశ‌ర్మ‌గారు క‌థ‌ను ఎలివేట్ చేసేలా  బ్యాక్‌గ్రౌండ్ సంగీతం ఎంతో దోహ‌ద‌ప‌డింది. నిర్మాత సాయిగారు వారి బేన‌ర్‌ లో అవకాశం ఇవ్వ‌డం ఆనందంగా వుంది అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరి మాట్లాడుతూ, భళాతంద‌నాన టైటిల్‌ ను సాయిగారే ఎంపిక చేశారు. శ్రీకాంత్ ఈ క‌థ‌కు మూలం. ఆయ‌న క‌థ చెప్ప‌గానే సినిమా ప్రారంభ‌మైంది. ఇద్ద‌రం ఒక టీమ్‌ గా ఏర్ప‌డి బాగా వ‌చ్చేలా చేశాం. కెమెరామెస్ సురేష్ బాగా స‌హ‌క‌రించారు. లైట్‌సెన్స్ బాగా వుంది. క్యాథ‌రిన్ పాత్ర‌ను బాగా పోషించింది. మ‌ణిశ‌ర్మ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సినిమాకు నాలుగు కీల‌క‌మైన భాగాలైన రైటింగ్‌, షూటింగ్, ఎడిటింగ్‌, సౌండ్ చ‌క్క‌గా కుదిరాయి. మే 6 న సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రేజ్ చేయండి. శ్రీ‌విష్ణు మీకు స‌ర్‌ప్రైజ్ ఇస్తాడు. స‌రికొత్త‌గా పాత్ర వుంటుంది. శేఖ‌ర్ క‌మ్ముల‌లోని సెన్సిబులిటీ, రాజ‌మౌళిలోని క‌మ‌ర్షియ‌ల్ ఒక్క‌శాతం వుండేలా చూసుకున్నాను. ప్రేక్ష‌కులే దేవుళ్ళు. అందుకే ఈ సినిమా వారికే అంకితం అన్నారు.
 
శ్రీ‌విష్ణు మాట్లాడుతూ, తెలుగు సినిమాను ప్ర‌పంచ‌స్థాయికి తీసికెళ్ళిన రాజ‌మౌళిగారికి థ్యాంక్స్‌. తెలుగు సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా వుంది. శేఖ‌ర్ క‌మ్ముల ‌గారంటే ప్ర‌త్యేక అభిమానం ఆయ‌న కొత్త‌వారిని ఎంక‌రేజ్ చేస్తారు. సాయిగారు డేరింగ్‌, డాషింగ్ నిర్మాత‌. ఏది అనుకుంటే అది వెంట‌నే స‌మ‌కూరేలా చేసేవారు. ఇందులో న‌టీన‌టులంతా బాగా చేశారు. ఇంత‌కుముందు ఎవ‌రూ చేయ‌ని పాత్ర‌లు వారు చేశారు. క్యాథ‌రిన్ పాత్ర చాలా డేరింగ్ గా వుంటుంది. త‌న‌కు కెరీర్‌లో బెస్ట్ ఫిలిం అవుతుంది. మ‌ణిశ‌ర్మ‌గారు రీరికార్డింగ్‌ తో స‌ర్‌ప్రైజ్ చేశారు. చైత‌న్య నేను 14 ఏళ్ళుగా స్నేహితులం. ఆయ‌న గురించి స‌క్సెస్‌మీట్‌ లో మాట్లాడ‌తాను. ఈనెల ‌6 న థియేట‌ర్ కు వ‌స్తున్నాం. మీ అంద‌రి స‌హ‌కారం మా సినిమాకు వుండాల‌ని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెరుకు రసం తీసిన సింగర్ సునీత.. వీడియో వైరల్ (video)