యాంకర్ సుమ నటించిన 'జయమ్మ పంచాయితీ` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు వచ్చినప్పటినుంచీ సుమ సీరియస్‌గానే వుంది. ఆహుతులు కూల్ చేసినా వినలేదు. అందుకు కారణం రాజమౌళి, కె. రాఘవేంద్రరావు వంటివారు హాజరుకాకపోవడమే. దాంతో తాము ఎందుకు రాలేదో చిన్న వీడియో బైట్‌ను విడుదల చేశారు.
అందులో కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, సుమ నువ్వు మాటల్తో పడేస్తావు. నేను షూటింగ్ పాటతో పడేయాలని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు రాత్రి షూట్ లో వున్నానంటూ, నా వెనుక కెమెరా కూడా వుందంటూ చూపిస్తూ అందుకే రాలేకపోయాను. 'జయమ్మ పంచాయితీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ తెలిపారు.
ఇక రాజమౌళి తన బైట్‌లో మాట్లాడుతూ, అమ్మ జయమ్మ, సుమమ్మ ఎప్పటినుంచో ఫ్యామిలీ ట్రిప్ అనుకున్నట్లు మేం వెళ్ళాం. కాబట్టి రాలేకపోయాను.నా ప్రతి సినిమాకు మీరే చేయాలి. దీన్ని సాకుగా చూపిస్తూ నా తర్వాత సినిమాకు ఎగ్గొట్టొద్దు. నామీద పంచాయితీ పెట్టవద్దు. 'జయమ్మ పంచాయితీ` చిత్రం అందరం కలిసి చూద్దాం అంటూ వివరించారు. అయినా ఇదేదో ఫేక్‌గా వుందంటూ సుమ సరదా కామెంట్ చేసింది. అనంతరం గాయకుడు శ్రీకృష్ణ ఓ పాటతో సుమను కూల్ చేశాడు. ఇదంతా 'జయమ్మ పంచాయితీ` చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో సరదాగా సాగింది.