ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
శుక్రవారం జరిగిన GQ అవార్డ్స్ 2022లో తారలు స్టైలిష్ లుక్స్, గ్లామర్ ఆరబోస్తూ విచ్చేసారు. మ్యాగజైన్ 2022లో '30 మంది అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల' జాబితాను ప్రకటించింది, ఇందులో క్రికెటర్ శుభ్‌మాన్ గిల్, ప్రతీక్ కుహద్, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, కృతి సనన్, పివి సింధు వంటి ప్రముఖులు ఉన్నారు.
ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకోవడానికి తారలు రెడ్ కార్పెట్‌పై మిరుమిట్లు గొలిపే గ్లామర్ అందాలను ఆరబోస్తూ కనిపించారు.
కియారా అద్వానీ స్ప్రింగ్/సమ్మర్ 2022 కలెక్షన్ నుండి అత్యంత గ్లామరస్ డ్రెస్ వేసుకుని ట్రాన్సపరెంట్ టాప్ తో వచ్చింది. ఆ సందర్భంగా ఆమె తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.