Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ- రామారావు ఆన్ డ్యూటీ నుంచి సొట్ట బుగ్గల్లో ప్రోమో విడుద‌ల‌

Webdunia
శనివారం, 7 మే 2022 (18:05 IST)
Ravi Teja, Rajisha Vijayan
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమౌతుంది. ఇప్పటికే  'రామారావు ఆన్ డ్యూటీ'  ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ 'బుల్ బుల్ తరంగ్' పాట విడుదలైన చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
 
ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ `సొట్ట బుగ్గల్లో` పాట ప్రోమో నేడు విడుద‌లైంది. ఫూర్తి సాంగ్‌ను రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.
ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఆకట్టుకుంది. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించి, డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ తో కూల్ అండ్ క్లాస్ గా అలరించారు. సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments