Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ ప్రసాద్ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (09:31 IST)
నాటక రంగం నుంచి బుల్లితెరకు ఆపై వెండితెరపై కనిపించిన వైజాగ్ ప్రసాద్ ఇకలేరు. ఆయన అనారోగ్యంతో ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఆయన వయసు 75 యేళ్లు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇంటికే ప‌రిమితం అయ్యారు.
 
ఆదివారం వేకువజామున సోమాజిగూడ య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసారు. వైజాగ్ ప్ర‌సాద్ మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటనిని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి సినీ ప్ర‌ముఖులు, అభిమానులు తెలియ‌జేస్తున్నారు. 
 
ఇదిలావుండగా, వైజాగ్ ప్ర‌సాద్ దాదాపు 170కి పైగా సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. 1983లో వచ్చిన "బాబాయ్ అబ్బాయ్" నటుడిగా ఆయన తొలి సినిమా. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన "నువ్వు నేను" సినిమాలో క‌థానాయ‌కుడి తండ్రిగా న‌టించి ప‌లు ఆఫ‌ర్స్ పొందారు. ఆ తర్వాత 'భ‌ద్ర'‌, 'జై చిరంజీవ', 'నీరాజ‌నం', 'జెమ‌ని', 'అల్ల‌రి బుల్లోడు', 'సుంద‌ర‌కాండ'‌, 'రాణీగారి బంగ్లా', 'ఇది మా ప్రేమ క‌థ‌' వంటి అనేక చిత్రాల్లో ఆయన కీలక పాత్రలను పోషించారు. 
 
ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి రావడంతో పేరు వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. చదువుకునే రోజుల్నుంచే నాటకాల్లో నటించేవాడు. బీఏ పూర్తి చేసిన ఈయనకు భార్య విద్యావ‌తి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్‌లో ఉంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments