Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు.. ఎందుకని?

ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు.. ఎందుకని?
, గురువారం, 18 అక్టోబరు 2018 (17:08 IST)
ఇటీవలి కాలంలో గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, కళ్లముందే కలియతిరుగుతూ కనిపించే వ్యక్తులు కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలేస్తున్నారు. అలా ఉన్నట్టుండి గుండెపోటురావడం, కుప్పకూలిపోవడానికిగల కారణాలను పరిశీలిస్తే, 
 
సాధారణంగా, గుండె నిమిషానికి 80 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. పుట్టుకతో గుండె జబ్బులున్న వారిలో కొన్నిసార్లు వేగం పెరుగుతుంది. తీవ్ర వేగం వల్ల హార్ట్‌ పంపింగ్‌ సరిగ్గా జరగదు. వేగం వందకు మించి కొట్టుకుంటే కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే ప్రమాదముంది. రక్తపోటు పడిపోవడం, గుండె బలహీనమవడంతో ఆకస్మాత్తుగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
కొందరు గుండె కండరాల సమస్యతో బాధపడుతుంటారు. కానీ, గుర్తించలేరు. కండరాల జబ్బుతో గుండె స్పందనల్లోనూ వస్తుంది. ఈసీజీ తీసినప్పుడు మాత్రమే నిర్ధారించడానికి వీలుంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వ్యక్తుల్లో గుండె స్పందనల్లో తేడా రావడం వల్ల ఉన్నంట్టుండి చనిపోతారు. 
 
అయితే, పుట్టకతో గుండె జబ్బులున్న వ్యక్తులు ఏ వయస్సులోనైనా అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదముంది. బాధితుల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. చనిపోయే తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటోంది. 
 
ఎక్కువసేపు వ్యాయమం చేసినా, ఆగకుండా డ్యాన్స్‌ చేసినా, ఎక్కువసేపు పరుగెత్తినా గుండె వేగం పెరిగి తీవ్రతతో స్పందనలు ఆగిపోవచ్చు. విపరీతంగా మద్యపానం చేసేవారు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారిలో గుండె కణాజలంపై వాటి ప్రభావం పడి గుండె వేగం పెరుగుతుంది.
 
పుట్టకతో గుండె జబ్బు ఉన్న వారిలో సమస్య రావడమే ప్రాణాంతకంగా వస్తుంది. గుండె లయ దెబ్బతినడం వల్ల మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఆక్సిజన్‌ అందకపోవడం, బీపీ పడిపడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతా ఐదారు నిమిషాల్లోనే జరిగిపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయిన కొత్త జంటలు అంత ఉత్సాహంగా వుండటానికి అదే కారణం...