అబ్బే.. ఒకే చోట కూర్చోవద్దు.. అరగంటకు ఒకసారి లేచి..?
ఉరుకులు పరుగుల జీవితం చాలామందికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారిలో శారీరక శ్రమ తక్కువైందని.. నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే.. రన్నింగ్, వాకింగ్ వంటివి తప్పని
ఉరుకులు పరుగుల జీవితం చాలామందికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారిలో శారీరక శ్రమ తక్కువైందని.. నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే.. రన్నింగ్, వాకింగ్ వంటివి తప్పనిసరి అంటూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే గంటలపాటు కూర్చుండిపోయే వారిలో జీవన ప్రమాణం తక్కువైందని.. ఎక్కువసేపు టీవీ చూడటం, కదలకుండా కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేసేవారే ఎక్కువగా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎంతసేపు కూర్చున్నారన్నది కాకుండా, రోజులో ఏ సమయం కూర్చున్నారన్నదీ ముఖ్యమేనట. అరగంటకోసారి ఓ పది అడుగులు వేయాలని, అదీ వీలుకాకపోతే కాసేపు నిల్చోవాలని వైద్యులు చెప్తున్నారు.
గంటల తరబడి కుర్చీలకు పరిమితమైతే మధుమేహం, గుండె సంబంధిత రోగాల బారిన పడాల్సిందేనని, అందుకే కూర్చుని పనిచేసినా.. వ్యాయామం అనేది రోజులో భాగం కావాలని వారు సూచిస్తున్నారు. వ్యాయామం వల్ల శరీరంలోని అన్ని కండరాలకు సరైన రక్తప్రసరణ జరిగి ఉత్సాహంగా ఉండొచ్చనని... ఇంకా అనారోగ్య సమస్యలు తప్పవని వారు చెప్తున్నారు.