Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహం వున్నా విందుకు వెళ్లాలనుకుంటున్నారా?

మధుమేహులు విందుకు వెళ్లాలనుకుంటే.. ముందు సలాడ్స్‌ తినేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విందుకు వెళ్లే ముందు.. ఇంట్లోనే సలాడ్లను, వేయించిన శెనగలు కానీ, సోయా గింజలను కానీ గుప్పెడు తినడం మంచిద

Advertiesment
మధుమేహం వున్నా విందుకు వెళ్లాలనుకుంటున్నారా?
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:01 IST)
మధుమేహులు విందుకు వెళ్లాలనుకుంటే.. ముందు సలాడ్స్‌ తినేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విందుకు వెళ్లే ముందు.. ఇంట్లోనే సలాడ్లను, వేయించిన శెనగలు కానీ, సోయా గింజలను కానీ గుప్పెడు తినడం మంచిది. ఇలా చేస్తే విందులో తినుబండారాల్ని ఆబగా తినేసే మానసిక స్థితి ఉండదు. ఇది గ్లూకోజ్‌ నియంత్రణకు తోడ్పడుతుంది.
 
ఇక పార్టీలో పీచుపదార్థం వుండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. మష్రూమ్‌, పన్నీర్‌ టిక్కా, సాదా దోసె లాంటివి తీసుకోవాలి. అయితే ఏ పదార్థాలైనా నిర్ణీత పరిమాణాన్ని మించి తీసుకోకూడదు. పైగా ఎంత నోరూరించినా ఒకేసారి అన్నీ కాకుండా ఓ అరగంట వ్యవధి ఇచ్చి తీసుకుంటే మేలు. 
 
సలాడ్‌తో మొదలెట్టి ఆ తర్వాత తందూరీ రోటీ తీసుకోవాలి. సలాడ్‌ను పెరుగుతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక ఎక్కువ కేలరీలు వుండే పప్పులు, నూనె, మసాలా కూరలు మాత్రం తీసుకోకూడదు. అలాగే మీగడ లేదా నెయ్యితో చేసిన పదార్థాలు అసలే తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇన్సులిన్ తీసుకునే వారైతే కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాల జోలికి వెళ్లకూడదు. పార్టీ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఓ సగం చెంచా మెంతి పొడి వేసుకుని గ్లాసు నీళ్లు తాగేస్తే గ్లూకోజ్‌ నియంత్రణలో ఉండడానికి ఎంతో తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?