అత్తగా అనసూయ ఇలా రెచ్చిపోతుందని ఊహించలేదు : 'రంగస్థలం'పై చిరంజీవి (Video)

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన రిలీజ్ కానుంది. ఆదివారం రాత్రి ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం వైజాగ్ వేదికగా జరిగింది

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (13:18 IST)
రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన రిలీజ్ కానుంది. ఆదివారం రాత్రి ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం వైజాగ్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసింది. ఫుల్‌గా ఈ పాత్ర చేస్తుందని నేను అనుకోలేదు. ఈ సినిమాలో రాణించడం, మెప్పించడమేకాకుండా పాత్రకు ఓ పర్పస్ ఉంది. వావ్.. ఇందుకోసమే అనసూయను సినిమాలో పెట్టారా? అనిపిస్తుంది. మంచి పాత్ర చేసి అనసూయ ఈ సినిమాలో రాణించారు' అంటూ కితాబిచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ సినిమా అన్ని విధాలుగా, అన్ని కోణాల్లోంచి కూడా అత్యద్భుతం అనిపించుకుంటుంది. రాబోయే రోజుల్లో అభిమానుల చేత శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అవార్డుల కోసమే సినిమాలు తీయరు.. కానీ ఈ సినిమా మాత్రం అవార్డులు సొంతం చేసుకుంటుంది. చిత్రంలోని అన్ని విభాగాలు అవార్డులు వస్తాయి. జాతీయస్థాయిలో ఈ సినిమాలు అవార్డు వస్తుందన్నా ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అవార్డులు రావాలి.. రాకపోతే సినిమాకు అన్యాయం జరిగినట్లే. ఈ ఏడాది ఈ సినిమా అత్యద్భుతమైంది కావాలని.. అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.ఎం(మోహన్‌) నిర్మాతలుగా రూపొందించారు. చిరంజీవి ప్రసంగానికి చెందిన పూర్తి ప్రసంగం వీడియో మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డికి ఓటెయ్యమన్నా, బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే వరెస్ట్ సీఎం అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

నెల్లూరు నగరంలో 100 పడకల ఈసీఐ ఆస్పత్రి- మంత్రి శోభా కరంద్లాజే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments