Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి "వాల్తేరు వీరయ్య"

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (13:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతిహాసన్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.108 కోట్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ చిత్రంతో చిరంజీవితో రవితేజ తోడుకావడంతో పాటు రెండో భాగంలో ఎమోషన్ చేరింది. దీంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. పైగా, ఈ చిత్రం మొదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలం చేకూర్చింది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా, బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతలా ఐటమ్ సాంగ్‌లో నటించారు. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments