Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందులో ఎలాంటి మొహమాటాలు లేవు.: కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల

Advertiesment
Designer Sushmita Konidela
, శుక్రవారం, 13 జనవరి 2023 (17:39 IST)
Designer Sushmita Konidela
వాల్తేరు వీరయ్య కథ విన్నపుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు నా ఆలోచనలు చాలా వరకూ మ్యాచ్ అయ్యాయి. వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే  ఒక ఇమాజినేషన్ వచ్చింది. బాబీ గారు ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే.. మాకు వింటేజ్ చిరంజీవి గారి లుక్ కావాలని చెప్పారు. మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో అలా వింటేజ్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్ కావాలని చెప్పారు.  నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. దీంతో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి,  శ్రుతి హాసన్ గారికి వారివారి డిజైనర్స్ పని చేశారు. అందరం ఒక మంచి సమన్వయంతో పని చేశాం` అని కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల అన్నారు. 
 
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య విశేషాలని పంచుకున్నారు.
 
నాన్నగారి కాస్ట్యూమ్స్ కోసం ఆయనతో చర్చిస్తుంటారా ?
తప్పకుండా నాన్నగారితో చర్చిస్తా. ఆయనకి వున్న అనుభవంతో ఒక సీన్ లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు.
 
ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఏదైనా రీసెర్చ్ చేశారా ?
వింటేజ్ లుక్ తీసుకురావాలి. అలా అని ఇది పిరియడ్ సినిమా కాదు కదా. యవతకు కూడా నచ్చేలా చేయాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ పై అవగాహన వుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ని మిక్స్ చేస్తూ ఆయన నప్పే డిజైన్స్, షర్ట్స్ ప్రత్యేకంగా రూపొందించాం.
 
వాల్తేరు వీరయ్యగా నాన్నగారిని తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది ?
ఇది నాన్నగారి మోస్ట్ కంఫర్ట్బుల్ జోన్. చూస్తున్నపుడు అద్భుతంగా అనిపించింది. ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్న ప్రతి రోజ పండగలానే వుండేది. 
 
 ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా వుంది ?
అమ్మ లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో చెప్పేస్తుంది. అమ్మ ఇన్ పుట్స్ చాలా వుంటాయి. అలాగే ఎలావున్నా చరణ్  తప్పకుండా కాల్ చేస్తాడు. 
 
నాన్నగారు సినిమాలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని  చూస్తున్నపుడు విజిల్స్ వేస్తుంటారా ?
ఇందులో ఎలాంటి మొహమాటాలు లేవు. ఆయన అభిమానిగా మేము చేసే పనే అది. ఉదయం నాలుగు గంటల కి టీం అందరితో కలసి షోకి వెళ్ళాం.  అభిమానులతో పాటు ఈలలు గోలలు అరుచుకుంటూ వచ్చాం.
 
చిరంజీవి గారు చాలా ఫిట్ గా కనిపించారు ? లుక్ విషయంలో మీరేమైనా ఫిట్ నెస్ టిప్స్ ఇచ్చారా ?
ఈ విషయంలో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదండీ. ఆయన హార్డ్ వర్క్ చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఫిట్ గా వుండేవాళ్ళ కాస్ట్యూమ్స్ బావుంటాయి. దానిని మైండ్ లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆయన మెంటైన్ చేస్తూ వచ్చారు. హెల్త్ పట్ల ఆయన చాలా స్పృహతో వుంటారు.
 
 డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పై ద్రుష్టి పెట్టారు కదా, నాన్నగారి సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా ?
నాన్నగారు లాంటి స్టార్ తో పని చేయాలనీ అందరి నిర్మాతలకు వుంటుంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే నాకు కూడా ‘’ముందు మంచి కథ తీసుకురా  వెంటనే చేద్దాం’’ అంటారు. మేము కూడా ఆ వేటలోనే వున్నాం.
 
రంగస్థలంలో రామ్ చరణ్ మాస్ గా డిజైన్ చేశారు.. ఇపుడు నాన్నగారు,. ఎవరు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు ?
ఖచ్చితంగా నాన్నగారే. నాన్నగారంత చక్కగా ఈ మాస్ లుక్ ని మరొకరు చేయలేరని భావిస్తున్నాను.
 
కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
భోళా శంకర్ జరుగుతోంది. అలాగే రెండు వెబ్ సిరిస్ లపై వర్క్ చేస్తున్నాం.అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు  సినిమా విడుదలకు సిద్దంగా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫామిలీ అంత హాయిగా చూడగలిగే కళ్యాణం కమనీయం : ప్రియ భవాని శంకర్