Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవిలోని ఆవేశం.. మంచితనం కలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ : డైరెక్టర్ బాబీ

bobby kolli
, సోమవారం, 9 జనవరి 2023 (08:58 IST)
మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు ఒక్క శాతం కూడా సరిపడవని టాలీవుడ్ దర్శకుడు బాబీ కొల్లి అన్నారు. అదేసమయంలో చిరంజీవిలోని మంచితనం, ఆవేశం కలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. 
 
చిరంజీవి హీరోగా, తాను దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది. ఇందులో దర్శకుడు బాబీ మాట్లాడుతూ, అన్నాయ్యా.. రాజకీయాలు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు. దేవుడు మీకు ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన సమాధానం చెబుతాడు. ఆయన గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం.. మంచితనం కలిస్తే పవన్ కళ్యాణ్. మాటకి మాట.. కత్తికి కత్తి పవర్ స్టార్ అని అన్నారు.
 
ఇకపోతే, చిరంజీవి అభిమానిగా ఇద్ర సినిమా చూసిన తర్వాత నా లక్ష్యం ఏమిటనేది అర్థమైంది. దాంతో ఇండస్ట్రీకి వచ్చాను. చిరంజీవికి మా నాన్నగారు కరుడుగట్టిన అభిమాని. ఇండస్ట్రీకి వచ్చిన 20 యేళ్లకి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గూగుల్లో తనకంటూ ఓ పేజీ వుంది. ఇంతకంటే ఇంకా ఏం కావాలి అన్నారు.
 
రాజకీయాలలో ఎదురుదాడి చేయరు ఎందుని అని నేను ఒకసారి అన్నయ్య చిరంజీవిని అడిగాను.. వాళ్లకి అమ్మనాన్నలు, అక్కా చెల్లెళ్లు ఉంటారు. వారు బాధపడుతారు అని అన్నారు. ఆయన మంచితనం ఎలాంటిదో అపుడు నాకు అర్థమైంది. ఇకపోతే నేను ఈ రోజున ఆ స్థాయికి చేరడానికి కారణం రవితేజనే. పవర్ సినిమాతో ఆయన నాకు అవకాశం ఇవ్వడం వల్లనే ఇక్కడకి వరకు వచ్చాను అని వినమ్రయంగా చెప్పుకొచ్చారు. 
 
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదలవుతుంది. శృతిహాసన్ హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్రకాష్ రాజ్, ప్రత్యేక పాత్రలో మాస్ మహారాజ్ రవితేజలు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ తర్వాత విశాఖలో స్థిరపడతా : మెగాస్టార్ చిరంజీవి