Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఖాతాలో స్ట్రైట్ హిట్ పడేనా?

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (14:28 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, నయనతార హీరోయిన్. అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు నటించారు. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఇటీవల విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కెరీర్‌లో చిరు తొలిసారి పీరియాడిక్ డ్రామా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొనివున్నాయి. సైరా చిత్రం భారీ విజ‌యం సాధిస్తుంద‌నే అభిప్రాయంలో అభిమానులు ఉన్నారు. అయితే కొంద‌రు నెటిజ‌న్స్ చిరు కెరీర్ విష‌యంలో కొన్ని లెక్క‌లు వేస్తున్నారు. 
 
గ‌త 17 యేళ్ళలో చిరు సాధించిన భారీ విజ‌యాల‌లో అన్ని రీమేక్ చిత్రాలే కాగా, ఈ సారైన‌ స్ట్రైట్ చిత్రంతో మంచి విజ‌యం సాధిస్తాడా లేదా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. 'ఇంద్ర' త‌ర్వాత చిరు చేసిన ఏ స్ట్రైట్ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. దీంతో సైరా నరిసింహా రెడ్డిపై మెగా అభిమానులే కాదు.. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక ప్రముఖులు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments