Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తొలి ట్వీట్ ఇదే...

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (11:43 IST)
ఇపుడు ప్రపంచాన్ని డిజిటల్ మీడియా శాసిస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటివి శాసిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఈ సోషల్ మీడియాల్లో ఏదో ఒకదానిలో ఖాతావుంటుంది. కానీ, తెలుగు సినీ ప్రపంచంలో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవికి మాత్రం ఒక్క ఖాతాకూడా లేదు. ఇపుడు ఆయన ఈ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు కొత్త సంవత్సరాది అయిన ఉగాది (శ్రీశార్వరినామసంవత్సరం) రోజున ఆయన తన సోషల్ మీడియా ఖాతాను ప్రారంభించారు. ట్విట్టర్‌లో తన తొలి పోస్ట్‌ చేశారు.
 
"అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం" అని తన ట్వీట్‌లో చిరంజీవి పిలుపునిచ్చారు. 
 
మరో ట్వీట్‌గా 21 రోజులు మనందరినీ ఇళ్ళల్లోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్టమైన సమయంలో మనం, మన కుటుంబాలు, మనదేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ ఇచ్చే ఆదేశాలని పాటిద్ధాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అని పేర్కొన్నారు. 
 
కాగా, ఆయన తన ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 18 వేల మంది ఫాలోయర్లు వచ్చిచేరారు. పైగా, ఇక అభిమానులు మెగాస్టార్ ట్విట్టర్ ఐడీని @KChiruTweets అనుసరించవచ్చు. ప్రొఫైల్ పిక్‌గా ఖైదీ నెం.150లోని స్టిల్‌ని జ‌త చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments