Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ సందడి చేసేందుకు సిద్ధమైన చిరు..

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (19:38 IST)
మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రానికి సంబంధించిన టీజర్ నిన్ననే విడుదలైంది. చిరంజీవి నటనకు అభిమానులు దాసోహం అంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే అంశంపై పోస్ట్‌లు పెడుతూ తెగ సంబరపడిపోతున్నారు. హాలీవుడ్ స్థాయిలో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన టీజర్ ఆకట్టుకుంది.

60 ఏళ్ల వయస్సులో కూడా చిరంజీవి ఆ స్థాయిలో నటించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. కష్టమైన సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు చిరు ఎలాంటి డూప్‌లు లేకుండా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారట. నిర్మాత రామ్ చరణ్, అలాగే దర్శకుడు సైతం ఈ విషయంలో డూప్ లేకుండా సన్నివేశాలను తీయాలని పట్టుబట్టి, చిత్రం ఆలస్యమైనా ఆ సీన్స్‌ను తనచేత చేయించారని మెగాస్టార్ టీజర్ విడుదల వేడుకలో పేర్కొన్నారు.
 
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే టాలీవుడ్‌లో మాత్రమే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఆడియో రిలీజు మొదలుకొని సక్సెస్ మీట్ వరకు అన్ని ఫంక్షన్‌లను హైదరాబాద్ లేదా విశాఖలో నిర్వహిస్తుంటారు. అయితే సైరా సినిమా అందుకు భిన్నం. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడంతో బాలీవుడ్‌లో ప్రమోషన్ చేసేందుకు అక్కడ టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
 
మెగాస్టార్ చిరు తెలుగులో స్టార్ హీరోగా ఉన్న సమయంలో బాలీవుడ్‌లో సైతం అజ్ కా గూండారాజ్, ప్రతిబంద్, జెంటిల్మెన్ వంటి సినిమాలు చేసారు. ఈ సినిమాలు మంచి విజయాలను అందించాయి. అప్పుడు చిరంజీవి వరుసగా హిందీ చిత్రాలు చేస్తారని అందరూ ఊహించారు. కానీ 1994లో వచ్చిన జెంటిల్‌మెన్ సినిమా తరువాత మళ్ళీ బాలీవుడ్ సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు అంటే 25 సంవత్సరాల తరువాత మెగాస్టార్ సైరా సినిమాతో తిరిగి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. చిరు బాలీవుడ్ రీఎంట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. 14 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదు..

తూచ్... నేను అలా అనలేదు.. 75 యేళ్ల రిటైర్మెంట్‌పై మోహన్ భగవత్

సుగాలి ప్రీతి కేసులో పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా వుంది : పవన్ కళ్యాణ్ వీడియో

Family Card: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి కుటుంబ కార్డు జారీ చేస్తాం: చంద్రబాబు నాయుడు

మిక్సీ వైరును గొంతుకు బిగించి భార్యను చంపేసిన తాపీమేస్త్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments