Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల దాకా మద్యం తాగి పోలీసులకు అడ్డంగా బుక్కైన నటి

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (09:37 IST)
మద్యం సేవించి వాహనం నడుపవద్దని పోలీసులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలతో ప్రచారం చేయిస్తున్నారు. కానీ, అదే సెలెబ్రిటీలు మద్యం సేవించి అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా ఓ నటి, నృత్య కళాకారిణి, బిగ్‌బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై మహానగరంలోని ఎంఆర్‌సీ నగర్‌లో ఓ నక్షత్ర హోటల్ ఉంది. ఇందులో ఇటీవల ఓ పార్టీ జరిగింది. పార్టీకి వెళ్లిన గాయత్రీ రఘురామ్ తిరిగి వస్తున్న వేళ, అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద మందు బాబుల కోసం తనిఖీలు చేపట్టారు. 
 
ఆ సమయంలో అటుగా వచ్చిన గాయత్రి కారును ఆపి, బ్రీత్ అనలైజర్‌లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బీఏసీ 185 రావడం గమనార్హం.
 
గాయత్రీ రఘురాంను కారులో చూడటంతో ఆ ప్రాంతమంతా ప్రజలు, అభిమానులతో నిండిపోయింది. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏదైనా మొబైల్ కోర్టులో ఆమె రూ.3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments