Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు రిటైర్మెంట్ దగ్గరపడింది... నేను అందుకే వచ్చా.. పవన్ కల్యాణ్

Advertiesment
చంద్రబాబుకు రిటైర్మెంట్ దగ్గరపడింది... నేను అందుకే వచ్చా.. పవన్ కల్యాణ్
, బుధవారం, 21 నవంబరు 2018 (20:52 IST)
దక్షిణ భారత దేశంలోని పార్టీలకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. తమిళనాడులోని అన్ని పార్టీల నాయకులతోనూ త్వరలోనే సమావేశం అవుతానన్నారు. ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని సహించను. మన రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం కేంద్రానికి వస్తున్నప్పటికీ సరైన రీతిలో నిధుల పంపకం జరగట్లేదు, దీనిమీద కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంపీల సంఖ్య ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ముందుగా నేను అన్ని రాష్ట్రాలలో తిరిగి జనసేన సిద్ధాంతాలు తెలియజేయాలి అనుకుంటున్నా. ద్రవిడ సంప్రదాయాల్ని అర్థం చేసుకోకుండా ఇక్కడి సంప్రదయాలపై దాడులు చేయడం వలన జల్లికట్టు లాంటి ఉధృత ఉద్యమం వచ్చింది.
 
జల్లికట్టు కోసం మీరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించింది. 2019 ఎన్నికలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉంటాయి, ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జయలలిత గారు ఉన్నప్పుడు నేను షూటింగ్ కోసం ఇక్కడ పొలాచ్చి ప్రాంతానికి వచ్చేవాడిని, అప్పుడు బీజేపీ మీద ఇక్కడి యువతకు ఉన్న ఆవేశాన్ని చూశాను. జాతీయ పార్టీ ఇక్కడి రాజకీయాల్లో తల దూర్చడం ఇక్కడి యువతకు నచ్చలేదు, ఇక్కడి ఆచారాల పట్ల వారి తీరు ఇక్కడి ప్రజలకు నచ్చలేదు, దాని ప్రభావం ఒక జల్లికట్టు లాంటి పెద్ద పోరాటానికి పిలుపు ఇచ్చింది. 
 
జల్లికట్టుని ఒక ఉద్యమంగా చూడలేదు, అది బీజేపీ మీద ఉన్న కోపం, ఇక్కడి ప్రజల ఆవేశం, వారి ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడం కోసం చేసిన పోరాటంలా చూశాను. రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ పార్టీలు వేలు పెట్టడం, నోట్ల రద్దు, జయలలిత గారి మరణానంతరం జరిగిన పరిణామాలు బీజేపీ మీద విపరీతమైన కోపాన్ని తెప్పించింది. పదేళ్లకు పైగా తెలంగాణలో తెలంగాణ లీడర్లు ఆంధ్రావాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులు లాగా చూస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదంతా మనస్థాపం కలిగించింది. చెన్నైలో ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితిని నేను ఎన్నడూ అనుభవించలేదు.
 
తమిళనాడుకు జనసేన పార్టీని పరిచయం చేయడానికే చెన్నై వచ్చాను. చంద్రబాబుకు రిటైర్మెంట్ దగ్గరపడింది. పంచాయతీ మెంబరుగా కూడా గెలవలేని నారా లోకేష్‌ను మంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేనతో ముడిపడి ఉంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మా పార్టీ స్టాండ్‌ ఎటువైపు తీసుకుంటుందో త్వరలోనే చెబుతా” అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా అన్నయ్య చిరంజీవికే వ్యతిరేకంగా వెళ్లినవాడిని... చెన్నైలో పవన్ కల్యాణ్(Video)