Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణీతది పెద్ద మనసు.. స్కూల్‌ను దత్తత తీసుకున్న పవన్ హీరోయిన్

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (09:11 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం "అత్తారింటికి దారేది". ఈ చిత్రంలో సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. ఇందులో ప్రణీత కన్నడ భామ. మాతృభాషలో పలు చిత్రాలు చేసినప్పటికీ అవి పూర్తిగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో స్థిరపడిపోయింది. 
 
అదేసమయంలో ప్రణీత పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పటికే అనేక మంది ప్రశంసలు పొందిన ప్రణీత.. కర్ణాటకలో తన తండ్రి పుట్టి పెరిగిన ఆలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేక అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుంది. 
 
దీంతో తన సొంతూరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి సదుపాయాలు లేని అక్కడి పాఠశాలను దతత్త తీసుకుంది. ఆ పాఠశాలకు ఐదు లక్షల రూపాయలతో కనీస సౌకర్యాలు కల్పించింది. మరుగుదొడ్డి నిర్మించడంతో పాటుగా విద్యార్థుల తరగతి గదులకు మరమ్మత్తులు చేయించి ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments