ఎన్టీఆర్ బయోపిక్.. మరో నటికి గోల్డెన్ ఛాన్స్.. ఎవరామె?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (18:35 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనేక పాత్రల కోసం పలువురు సినీ ప్రముఖులను తీసుకుంటున్నారు. ఈ కోవలో మరో హీరోయిన్‌కు అవకాశం కల్పించారు. 
 
ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ చిత్రంలోని నటీనటుల విషయంలో క్రిష్ తీసుకుంటున్న జాగ్రత్తలు, వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే.. విడుదల తర్వాత ఎన్టీఆర్ సృష్టించే సునామీ ఎలా ఉండనుందనేది అంతుచిక్కడం లేదు. 
 
ఎన్టీఆర్‌తో అప్పట్లో నటించిన అందరినీ మరోసారి వెండితెరపైకి తీసుకురానుండటం నిజంగా హర్షణీయం. కాగా ఇప్పటికే పలు పాత్రల కోసం రకుల్ ప్రీత్, నిత్యా మీనన్, విద్యాబాలన్, పాయల్ రాజ్‌పుత్, రానా, సుమంత్‌లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు హన్సికను కూడా తీసుకొని ప్రాజెక్టుకి కొత్త అందం తీసుకొచ్చాడు.
 
చిత్రంలో జయప్రద పాత్రలో హన్సికను తీసుకున్నట్లు సమాచారం. అప్పట్లో 'అడవి రాముడు, యుగ పురుషుడు' వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో చిందులేసింది. వీరి కాంబోలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి' లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు వాటిల్లోని కొన్ని పాటలలో బాలయ్యతో ముద్దుగుమ్మలు చిందులేయటం ఉహించుకొని సంబర పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments