Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రముఖి 3 రజని కాంత్ తో చేయాలి : డైరెక్ట‌ర్ పి.వాసు

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:28 IST)
P. Vasu, Kangana, lawrence, mahima
చంద్రముఖి సినిమాను రజనీ కాంత్ తో డైరెక్ట‌ర్ పి.వాసు తెరకేకించారు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాతో నయనతార వెలుగులోకి వచ్చింది. అయితే సీక్వెల్ కూడా రజనీ తో చేయాలి. కానీ కుదరలేదు. దాని గురించి డైరెక్ట‌ర్ పి.వాసు ఏమన్నారో తెలుసుకుందాం. 
 
డైరెక్ట‌ర్ పి.వాసు మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ‘చంద్రముఖి2’తో రాబోతున్నాను. చంద్ర‌ముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ క‌థ‌ను సిద్ధం చేశాను. క‌చ్చితంగా ఆడియెన్స్‌కు సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగ‌వ‌ల్లి సినిమా ఉంది. దాన్ని రజనీ సార్ తో చేయాలి. కానీ ఆటైంలో రోబో సినిమాకులం డేట్స్ ఇవ్వడం వాళ్ళ కుదరలేదు. అందుకే దాన్ని వెంకటేష్ తో చేసామ్. 
 
నాగ‌వ‌ల్లిలో డిఫ‌రెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్ర‌ముఖి మ‌ళ్లీ  ఎందుకు వ‌చ్చింద‌నే పాయింట్‌తో చేశాను. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారి పాత్ర‌లో రాఘ‌వ లారెన్స్ న‌టించారు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణిగారితో వ‌ర్క్ చేయ‌టం వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. ఇళ‌య‌రాజాగారి త‌ర్వాత అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న సినిమా. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారాయ‌న‌. త‌ప్ప‌కుండా సెప్టెంబ‌ర్ 28న వ‌స్తున్న ‘చంద్రముఖి2’ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ఈ సినిమాలో ముగింపులో వడివేలు తో ఓ దైలౌగే ఉంది. పాత భవంతిని చూదగానే ఓ ట్విస్ట్ ఉంటుంది. అది చంద్రముఖి3 ఉండబోతుంది అనేలా పెట్టాం. అయితే ఎన్ని భాగాలైన తీయవచ్చు. ఈసారి తీయాలంటే రజనీ సార్ తో కుదిరితేతప్పకుండా చేస్తాను’’ అన్నారు.
 
మ‌హిమా నంబియార్ మాట్లాడుతూ ‘‘చంద్రముఖి2’ నాకెంతో స్పెషల్ మూవీ. కంగనా రనౌత్‌గారు, రాఘ‌వ లారెన్స్‌గారు, వడివేలుగారు ఇలా పెద్ద స్టార్ క్యాస్ట్‌, భారీ బ‌డ్జెట్‌తో చేసిన సినిమాలో న‌టించ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. వాసుగారు వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌టం మెమ‌ర‌బుల్. సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతున్న ఈ మూవీ అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments