రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ చంద్రముఖి 2. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రముఖి 2 చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ వాసుగారు చంద్రముఖి2 మూవీ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. ఆయనతో ఫోన్ చేసి మాట్లాడితే రజినీగారు బిజీ షెడ్యూల్ వల్ల చేయటం లేదు మరో హీరోతో చేయాలనుకుంటున్నానని అన్నారు. సరే కథ ఎప్పుడు చెబుతారని అనగానే సాయంత్రం కలవమని అన్నారు. నేను వెళ్లగానే ఆయన కథ చెప్పారు. నాకెంతో నచ్చింది. రజినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను నటించటం అంటే ఆ రాఘవేంద్రస్వామిగారి అదృష్టం అని అనుకోవాలి. సూపర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు.
నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించాను. కచ్చితంగా సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను. కంగనా రనౌత్ వంటి పెద్ద స్టార్‌తో నటించటం లక్కీ. ముందు ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. ఆ విషయం ఆమెకు చెప్పగానే ఆమె సెక్యూరిటీని బయటకు పంపేశారు. చక్కగా కలిసిపోయి నటించారు. చంద్రముఖి పాత్రలో భయపెట్టారు. వాసుగారితో ఇది వరకు శివలింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా చంద్రముఖి2 చేశాం.
ఈ సినిమా చేస్తున్నా అని అనుకున్న తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా గురువుగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అలాగే ఈ సినిమాలో వేట్టయార్ రోల్ చేసినప్పుడు కూడా రజినీగారి ఆశీర్వాదాలు తీసుకునే నటించాను. మీరు చేసినట్లు చేయాలంటే భయంగా ఉంది అన్న.. అప్పుడు ఆయన.. ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా. మిడిల్ లో పెరఫార్మెన్సు చేయి. దేనికి ఎక్కువ ఎమోషనల్ వద్దు.. అని సలహా ఇచ్చారు. ఆయన మాటలు పాటించా.
ఆస్కార్ విన్నర్ కీరవాణిగారు, వడివేలు వంటి స్టార్ కమెడియన్‌తో మళ్లీ పనిచేయటం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్. సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతుంది అన్నారు.