తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య స్టార్ హీరో శింబుతో లవ్వాయణం నడిపిందని.. ఆ రూమర్ కాస్త వైరల్ కావడంతో ధనుష్ ఐశ్వర్యకు విడాకులు ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ సెలబ్రిటీల పర్సనల్ రిలేషన్షిప్కు సంబంధించి ఏ చిన్న లీక్ దొరికినా సోషల్ మీడియా అల్లుకుపోతుంది.
తాజాగా ఐశ్వర్య, ధనుష్ డివోర్స్కి సంబంధించిన అలాంటి రూమరే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే.. ఐశ్వర్య-ధనుష్ కాపురానికి శింబునే చిచ్చుపెట్టాడని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ధనుష్ కూడా ఓ స్టార్ హీరోయిన్ ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కాగా ఐశ్వర్య, ధనుష్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు.