Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోలీవుడ్ నలుగురు హీరోలకు రెడ్ కార్డులు జారీ.. ఏం జరిగింది?

Advertiesment
Dhanush_Simbu_Vishal_Adarva
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:43 IST)
Dhanush_Simbu_Vishal_Adarva
తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోలకు నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నలుగురు హీరోలకు రెడ్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన నిర్మాతల మండలి సాధారణ సమావేశంలో స్టార్ హీరోలు ధనుష్, విశాల్, శింబు, అధర్వ మురళికి రెడ్ కార్డ్ జారీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
 
2021లో నిర్మాత మైఖేల్ రాయప్పన్, శింబు మధ్య వివాదం తలెత్తింది. ఈ సినిమా కోసం 60 రోజుల డేట్స్ ఇచ్చిన శింబు కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాడని, దాంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని రెండేళ్ల క్రితం నిర్మాత మైఖేల్ రాయప్పన్ పోలీసులను ఆశ్రయించారు. రాయప్పన్ కంప్లయింట్ చేసిన నేపథ్యంలో శింబుకి రెడ్ కార్డ్ పడినట్లుగా సమాచారం.
 
అయితే ఇందులో భాగంగానే తమిళ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు కూడా రెడ్ కార్డ్ పడింది అనేది మరో సంచలన విషయం. ఇది హాట్ టాపిక్‌గా మారింది. 
 
తేనాండాళ్‌ నిర్మాణ సంస్థలో ధనుష్‌ ఓ చిత్రాన్ని అంగీకరించారని, షూటింగ్‌ మొత్తం పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారని నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. 
 
దాంతో ధనుష్‌కి కూడా రెడ్ కార్డ్ పడబోతోందని తమిళనాట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. వీరితో పాటు యువ హీరో అథర్వ మురళికి కూడా నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ఇన్‌స్టాలో పెళ్లి ఫోటో ప్రత్యక్షం: ప్లీజ్ మళ్లీ కలిసిపోండి సామ్-చై