Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిక నుంచి స్ఫూర్తి పొంది చంద్రముఖి 2 చేశా: కంగ‌నా ర‌నౌత్

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:12 IST)
Kangana Ranaut
చంద్రముఖి 2 లో నటించిన కంగ‌నా ర‌నౌత్ అసలు ఈ సినిమాలోకి ఎల్లా వచ్చానో ఇలా తెలిపింది. ‘‘నేను ఇంత‌కు ముందు ద‌క్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజ‌న్ సినిమాలో న‌టించాను. ఇప్పుడు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ‘చంద్రముఖి2’తో ప‌ల‌క‌రిస్తాను. ఈ మూవీలో చంద్ర‌ముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియ‌ర్ సినిమా చేయాల‌ని నా ద‌గ్ర‌కు వ‌చ్చిన‌ప్పుడు నేను చంద్ర‌ముఖి 2లో చంద్ర‌ముఖిగా ఎవ‌రు న‌టిస్తున్నార‌ని అడిగాను. ఎవ‌రినీ తీసుకోలేద‌ని అన్నారు. నేను న‌టిస్తాన‌ని అడ‌గ్గానే ఆయ‌న వెంట‌నే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. 
 
‘చంద్రముఖి’లో కామెడీ, హార‌ర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. చంద్ర‌ముఖిని ప‌లు భాష‌ల్లో చేశారు. అయితే జ్యోతిక‌గారు ఆ పాత్ర‌ను చాలా ఎఫెక్టివ్‌గా చేశారు. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. చంద్ర‌ముఖిలో జ్యోతిక‌ను చంద్ర‌ముఖి ఆవ‌హిస్తుంది. కానీ ‘చంద్రముఖి2’లో నిజ‌మైన చంద్ర‌ముఖి పాత్ర ఉంటుంది. దాని కోసం డైరెక్ట‌ర్ వాసుగారు కొత్త‌గా నా పాత్ర‌ను తీర్చిదిద్దారు. సెప్టెంబ‌ర్ 28న ‘చంద్రముఖి2’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments