Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే... చంద్రబాబు బయోపిక్ పూర్తి

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (18:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం" చంద్రోదయం". ఈ బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పైన సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ చంద్రబాబు నాయుడుని కలిసారు యూనిట్.
 
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. "ఆకులు ఎన్ని కాల్చినా బొగ్గులు కావు బ్రదర్. జిత్తులమారి నక్కలు, తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే" అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్‌తో షూటింగ్ విజయవాడలో పూర్తి అయ్యింది. చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలోనె  ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు గారి బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తి చేశాము. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్థాయికి చేరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నాం" అన్నారు.
 
నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. నారా వారి పల్లె, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్‌లో సినిమా షూటింగ్ చేశాము. మహా నాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2వ వారంలొ విడుదల చెస్తాము. సంక్రాంతికి  సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. 
 
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments