Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ జంప్...

ఓ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ అదృశ్యమైంది. తమిళనాడులోని కొడైక్కెనాల్ నుంచి కనిపించకుండా పోయిన ఆ హీరోయిన్ చివరకు ఢిల్లీలో తేలింది. ఇంతకు ఆ హీరోయిన్ అలా మిస్ కావడానికి గల కారణాలను పరిశీలిస్తే...

Advertiesment
షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ జంప్...
, శనివారం, 1 సెప్టెంబరు 2018 (13:25 IST)
ఓ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ అదృశ్యమైంది. తమిళనాడులోని కొడైక్కెనాల్ నుంచి కనిపించకుండా పోయిన ఆ హీరోయిన్ చివరకు ఢిల్లీలో తేలింది. ఇంతకు ఆ హీరోయిన్ అలా మిస్ కావడానికి గల కారణాలను పరిశీలిస్తే...
 
తమిళ చిత్రం 'అవళుక్కెన్న అళగియ ముగం' (ఆమెకు ఏం అందమైన ముఖం) అనే చిత్రంలో హీరోయిన్‌గా అనుపమా ప్రకాష్‌‌ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎత్తైన కొండ ప్రాంతమైన కొడైక్కెనాల్‌లో జరుగుతోంది. ఈ స్పాట్ నుంచి ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది.
 
దీనిపై ఆరా తీయగా కొండ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతంలో తన చేత నృత్యం చేయించడంతో భయాందోళనకు గురయ్యారు. అనూహ్యంగా షూటింగ్‌ నుంచి ఎవరికి చెప్పకుండా తన గదికి వెళ్లిపోయిన ఈమె.. తర్వాత చిత్ర బృందానికి తెలియకుండా మదురై వెళ్లిపోయింది. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లింది.
 
ఈ విషయం తెలియని చిత్ర బృందం ఆమె కోసం అనేక చోట్ల గాలించింది. చివరకు ఆమె ఢిల్లీ వెళ్లారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. తర్వాత నిర్మాత ఢిల్లీ వెళ్లి ఆమెను బుజ్జగించడంతో పాటు తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి చెన్నైకి తీసుకొచ్చారు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీకి కొత్త పాఠం నేర్పిన 'గీత గోవిందం' సక్సెక్