కంగనా రనౌత్ అదరగొట్టేసింది.. మణికర్ణిక షూటింగ్‌ను పూర్తి చేసింది..

ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన మణికర్ణిక సినిమాను హీరోయిన్ కంగనా రనౌత్ టేకప్ చేసింది. క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్‌తో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలను కంగనాకు అప్పగించారు.

శనివారం, 13 అక్టోబరు 2018 (12:42 IST)
ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన మణికర్ణిక సినిమాను హీరోయిన్ కంగనా రనౌత్ టేకప్ చేసింది. క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్‌తో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలను కంగనాకు అప్పగించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ కంగనా నేతృత్వంలో జరుగుతోంది. అయితే కంగనా డైరెక్టర్ అనే విషయం సోనూసూద్‌కి నచ్చక ఆయన ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేశాడు. 
 
దర్శకురాలిగా కంగనాకి ఏం అర్హత ఉందని సోనూసూద్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్‌గా క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.70 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త ఇప్పుడు రూ.100 కోట్లకు చేరుకోవడం, విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మణికర్ణిక సినిమా షూటింగ్‌ను కంగనా రనౌత్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ అంతా ఓ ప‌నైపోయింది బాబూ అంటూ ఫోటోల‌కు పోజ్ ఇచ్చారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 జ‌న‌వ‌రి 25న "మ‌ణిక‌ర్ణిక" విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అమితాబ్‌ నిజాలు కూడా బయటపడతాయ్-హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా