Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటికి ఛాన్స్..

నందమూరి హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వివి వినాయక్‌తో కలిసి పనిచేయనున్నారని తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి కాంబో చెన్నకేశవరెడ్డి హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు పదహారేళ్ల తర్వాత వీరిద్ద

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటికి ఛాన్స్..
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:29 IST)
నందమూరి హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వివి వినాయక్‌తో కలిసి పనిచేయనున్నారని తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి కాంబో చెన్నకేశవరెడ్డి హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు పదహారేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. 
 
ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య బోయపాటి సినిమాలో నటిస్తారని.. ఈ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్ వినాయక్‌తో సినిమా చేసే అవకాశం వున్నట్లు సినీ వర్గాల సమాచారం.
 
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయపాటికి ఛాన్సిచ్చి.. తర్వాత వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
ఇందుకోసం వినాయక్ మంచి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. దాంతో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై నందమూరి అభిమానుల మధ్య అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్ : వాళ్ళ నాన్నగారిలా బాబాయ్... మా నాన్నగారిలా నేను...