అమెరికాలో కాల్పులు... మరో తెలుగువాడు మృతి... గుంటూరు వాసి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:03 IST)
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పృథ్వి తండ్రి హౌసింగ్ బోర్డ్ ఏపీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. పృథ్వి మరణ వార్తను తండ్రికి ఫోన్ ద్వారా అమెరికా పోలీసులు తెలియజేశారు. కుమారుడు మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం టమోటా జ్యూస్‌కి చిటికెడు ఉప్పు లేదా పంచదార కలుపుకుని తాగితే?