కోడలిని కత్తి చూపి చంపేస్తానంటూ బెదిరించి. మామ అత్యాచారం..

కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వావివరసలు లేకుండా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇంటికొచ్చిన కోడలిపై మామ కన్నేశాడు. కోడలిని కన్నకూతురిగా చ

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (12:14 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వావివరసలు లేకుండా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇంటికొచ్చిన కోడలిపై మామ కన్నేశాడు. కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సింది పోయి.. మామే కోడలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. 
 
బాధితురాలికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా.. వీరితో పాటు అదే ఇంట్లో ఉంటున్న ఆమె భర్త తండ్రి.. కోడలిపై కన్ను వేశాడు. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కత్తితో చంపుతానంటూ బెదిరించి కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి పంపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నిద్రమత్తులో నాలుగేళ్ల బాలుడు ఏం చేశాడంటే?