Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ నారప్ప తొలి సింగిల్ వచ్చేసింది...

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (14:59 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నార‌ప్ప‌'. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య 'సుందరమ్మ'గా నటించారు. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. 
 
ఈ క్రమంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందంటూ వార్తలు రావడం, వాటిని చిత్రయూనిట్‌ ఖండించడం వంటి విషయాలు తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రంలోని 'చలాకి చిన్నమ్మీ..' అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను జూలై 11 ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. 
 
కాగా, నారప్ప సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా, ఆయన పుట్టిన రోజు సందర్భంగా నారప్ప సినిమా లోని ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments