Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నార‌ప్ప‌ సెన్సార్ పూర్తి U /A సర్టిఫికేట్

నార‌ప్ప‌ సెన్సార్ పూర్తి U /A సర్టిఫికేట్
, మంగళవారం, 29 జూన్ 2021 (18:27 IST)
Narappa still
హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీకెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో విక్టరీని ఇంటిపేరుగా  మార్చుకున్నారు. విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.
 
ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే త‌న అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. వెంకటేష్‌ను ఇంత‌వ‌ర‌కూ మ‌నం చూడ‌ని ఒక కొత్త‌ అవతారంలో చూపించ‌నున్నారు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే ఆయ‌న మేకింగ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ కానుంది. 
 
తారాగ‌ణం: విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు 
 
సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ, కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు ముక్క‌లుగా `మా` వార్త‌కు అనూహ్య‌స్పంద‌న,`మా` ఆంధ్ర వుంద‌న్న దిలీప్ రాజా