Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంక‌టేష్ `నార‌ప్ప` యంగ్‌లుక్‌

వెంక‌టేష్ `నార‌ప్ప` యంగ్‌లుక్‌
, గురువారం, 11 మార్చి 2021 (17:11 IST)
Narappa young
సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరి ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటి నుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.
మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇప్పటివరకు ఓల్డ్ లుక్ గెటప్స్‌తో మెప్పించిన వెంక‌టేష్ ఈ సారి యంగ్ లుక్ లో క‌నిపించి ప్రేక్ష‌కుల్నిస‌ర్‌ప్రైజ్ చేశారు. విక్ట‌రి వెంక‌టేష్ యంగ్ లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
 
\వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఏక్ మినీ కథ` టీజ‌ర్ కి స్పంద‌న‌