Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇప్పుడు కాక ఇంకెప్పుడు" సినిమాపై కేసు

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:17 IST)
ఇప్పుడు కాక ఇంకెప్పుడు ... సినిమా పూర్తి వివాదాస్పదం అయింది. ఈ సినిమాపై, చిత్ర యూనిట్ పై భగ్గుమంటున్నారు హిందువులు. వేంకటేశ్వర స్వామివారి భజగోవిందం కీర్తనతో అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారని దర్శకుడు, నిర్మాత, నటీనటులు సహా పలువురిపై వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
 
హిందువుల విశ్వాసాలను గాయపరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని విహెచ్పి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ డిమాండ్ చేశారు. పోలీసులకు వేర్వేరుగా లిఖిత పూర్వక ఫిర్యాదులు అందజేశారు.
 
చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా  రూపొందుతోన్న చిత్రం `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా  చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని జులై 30న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాతలు.
 
అయితే, విడుద‌ల‌కు ముందే "ఇప్పుడు కాక ఇంకెప్పుడు" సినిమాపై కేసు నమోద‌యింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు చేశారు. సినిమా ప్రోమో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్లో పిర్యాదు అందుకున్నారు. 67 ఐటి యాక్ట్, 295 ఐ.పి.సి. సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులోని పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయ‌ని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్ర‌సాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments