కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు రెండు వారాలుగా ఉద్ధృతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేరళ సరిహద్దుల్లో కర్ణాటక ఆంక్షలు విధించింది.
తమిళనాడు సైతం కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష, కొవిడ్ టీకా ధ్రువపత్రాలను తప్పనిసరి చేసింది. గడచిన నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు 80 శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.
మరోవైపు టీకాల కొరతతో వాటి పంపిణీ మందకొడిగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు రెండు వారాలుగా ఉద్ధృతమయ్యాయి.
రోజువారీ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. పాజిటివిటీ రేటు 11 నుంచి 14.5శాతం వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో కేరళ సరిహద్దుల్లో కర్ణాటక ఆంక్షలు విధించింది. తమిళనాడు సైతం కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష, కొవిడ్ టీకా ధ్రువపత్రాలను తప్పనిసరి చేసింది.