Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి.. ఎవరు..?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (20:09 IST)
సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్ చేసింది. గొర్రెల కాపరులను అవమాన పరిచేలా చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలంది. మోహన్ బాబుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలంటూ మంగళవారం ఆ సంఘం నేతలు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ మరికొందరు నేతలతో కలసి ఫిర్యాదు చేశారు.
 
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు.. మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు ఇష్టారీతిన కామెంట్లు చేశారన్నారు. గొర్రెల కాపరులను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందని, అందరూ చూస్తున్నారని మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
 
మోహన్ బాబు కామెంట్లతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు పోలీసులను కోరామని చెప్పారు. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. అంతేకాకుండా గొర్రెల కాపరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments