మాదక ద్రవ్యాల అంశంపై తలా తోకాలేని ప్రశ్నలు సంధించి తన స్టేట్మెంట్ రికార్డు నమోదు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, మీడియా సమావేశంలో తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ విశాఖ ఏజెన్సీ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చారన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మీడియాలో తాను మాట్లాడిన అంశాలపై ఆధారాలివ్వాలని అడిగారన్నారు. తలా తోకా లేని ప్రశ్నలు వేసి సమాధానం ఇవ్వమన్నారన్నారు. దీంతో వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ చూపించానన్నారు.
తన స్టేట్‌మెంట్‌ను నర్సీపట్నం పోలీసులు రికార్డ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను నీరుగారుస్తున్నారని విమర్శించారు. తన కార్యకర్తలను బెదిరించడానికే పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన గంజాయి పండిస్తున్నారని ఆనందబాబు అన్నారు.