వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

దేవీ
మంగళవారం, 29 జులై 2025 (16:06 IST)
Hrithik, Kiara Duet Song
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా అనే పాట దేశాన్ని ఊపేసింది. మరోసారి అయాన్ తన టీంను ‘వార్ 2’ కోసం రంగంలోకి దించారు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్‌ భారీ ఎత్తున నిర్మించింది. ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది.
 
ఇక తాజాగా ఈ మూవీలోని ఓ డ్యూయెట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. హృతిక్, కియారా మీద చిత్రీకరించే ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ కేసరియా సంగీత బృందాన్ని రంగంలోకి దించారు. ‘వార్ 2’లోని ఈ యుగళ గీతం కోసం ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య మళ్ళీ ఒకే చోటకు చేరారు. త్వరలోనే ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘వార్ 2’లో హృతిక్, కియారా పాత్ర మధ్య ప్రేమను చూపించే అందమైన ట్రాక్‌గా ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఇక ఇదే ‘వార్ 2’ నుంచి వచ్చే మొదటి పాట అవుతుందన్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ యాక్షన్ ప్యాక్డ్ ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments