Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

Advertiesment
New poster of War 2

దేవీ

, బుధవారం, 16 జులై 2025 (14:23 IST)
New poster of War 2
బ్లాక్‌బస్టర్ YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న ‘వార్ 2’ గురించి ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామాని యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్‌గా నిర్మించిందది. ఈ  ‘వార్ 2’ చిత్రం మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఈ హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 14న తెరపైకి గ్రాండ్‌గా రానుంది.
 
‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా మేకర్లు తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రల్ని చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ త్రయానికి చిత్రంలో ఉన్న ఇంపార్టెన్స్ చూపించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచేసింది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న ‘వార్ 2’ ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా రికార్డులు క్రియేట్ చేయబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం