Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

Advertiesment
War 2- Nagavamsi

దేవీ

, శనివారం, 5 జులై 2025 (16:50 IST)
War 2- Nagavamsi
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహిస్తోంది. హ్యాట్రిక్ విజయాల కోసం ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, దేవర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘వార్ 2’ కోసం కలిసి పని చేస్తోంది.
 
YRF బ్లాక్ బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం అందరూ ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయటానికి సిద్ధమైంది. వార్ 2 తెలుగు థియేట్రికల్ హక్కులను సితార ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది.
 
ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ‘‘హ్యాట్రిక్ హిట్ కోసం సరికొత్త ఎనర్జీ, ప్యాషన్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్, పవర్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ కాంబోలో రానున్న వార్2తో ఓ ఎక్స్‌ప్లోజివ్ రైడ్‌ను  ప్రారంభిస్తున్నాం. వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఆగస్ట్ 14 న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది.
 
 భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్2 యష్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా , మరో అధ్యాయంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పఠాన్, టైగర్ 3, వార్ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న వార్ 2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ లెవల్లో లీజ్ చేస్తుండటం ప్రేక్షకులకు పండగే.
 
వార్ 2 మూవీలో ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండే పోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది.  బ్రహ్మాస్త్ర, యేహ్ జవానీ హై దీవానీ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ  దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః