War 2 is a spy action movie
వార్ 2 ట్రైలర్‌లో పాన్ ఇండియన్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఫెరోషియస్ లుక్‌లో అదరగొట్టారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతూ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్స్ ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. టాప్ నాచ్ విజువల్స్, బీజీఎమ్‌తో పాటు ఐ ఫీస్ట్‌గా సాగుతూ ఆడియెన్స్‌కు గూస్ బంప్స్‌ను కలిగించింది. ట్రైలర్...ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇద్దరు మెగాస్టార్స్ విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ పిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమాకు శ్రీధర్ రాఘవన్ కథను అందిస్తున్నారు.
వార్ 2 ట్రైలర్‌లో దేశ రక్షణే తమ ప్రథమ కర్తవ్యం అంటూ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేసిన ప్రమాణం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఛాలెంజ్‌తోనే సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ఎంత ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నది మేకర్స్ చూపించారు. ట్రైలర్‌లో సినిమా కథేమిటి, అసలు ఏజెంట్ ఎవరు అన్నది రివీల్ చేయకుండా ఆడియెన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ట్రైలర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వకుడదనే ఐడియా ప్రొడ్యూసర్‌దేనని రైటర్ శ్రీధర్ రాఘవన్ అన్నారు.
శ్రీధర్ రాఘవన్ మాట్లాడుతూ...మాతృభూమి రక్షణ కోసం డేంజరస్ కోవర్ట్ ఆపరేషన్‌లోకి ఇద్దరు ఏజెంట్స్ అడుగుపెడతారు. దేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి వెనుకాడని వారి ధైర్యసాహసాలను, పోరాటాన్ని చాటిచెబుతూ స్పై యూనివర్స్ ప్రమాణం ఉంటుంది. ఈ ప్రమాణం సినిమా కథను, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఆడియెన్స్‌కు థియేటర్లలో హై ఫీల్ ఇస్తుంది. దేశం కోసం పోరాడే ఇద్దరు ఏజెంట్లు ఒకరితో మరొకరు ఎందుకు తలపడాల్సివచ్చింది అన్నది సినిమాలో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అసలు ఈ ఇద్దరిలో నిజమైన ఏజెంట్ ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న లింక్ ఏమిటన్నది థ్రిల్లింగ్‌ను పంచుతుంది అని శ్రీధర్ రాఘవన్ చెప్పారు.
వార్ 2 మూవీ తెలుగు హిందీ, భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ స్పై యాక్షన్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేలా వార్ 2 ఉండబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.